రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు

న్యూఢిల్లీ (CLiC2NEWS): అంతర్జాతీయంగా నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో బంగారం ధరల్లో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో హెచ్చు తగ్గులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరిన విషయం తెలిసిందే… తాజాగా బుధవారం 11 గంటల సమయంలో బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ బంగారం ధర రూ. 98,700లుగా ఉంది. అలాగే వెండి ధర కూడా స్వల్పంగా దిగొచ్చింది. కిలో వెండి ధర రూ. 98,720గా ఉంది.
మరో వైపు రానున్న ఏప్రిల్ 30 వ తేదీన అక్షయ తృతీయ నాటికి బంగారం ధరలు దిగిరాకపోతే అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.