పెరిగిన బంగారం ధరలు

హైద‌రాబాద్ (CLiC2NEWS): ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. కరోనా నేపథ్యంలో పసిడి ధరలు పెరుగుతు న్నాయని నిపుణులు అంటున్నారు. అయితే గత వారం రోజుల నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. గత కొన్ని నెలలుగా దిగి వచ్చాయి. అయితే మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న పరిణామాలతో పసిడికి మళ్ళీ రెక్కలు వచ్చాయి.

ఆగస్టులో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.45,000కు దగ్గరగా కదలాడుతోంది. ఇదే విషయంపై మార్కెటింగ్ నిపుణులు స్పందిస్తూ.. అంతర్జాతీయ పరిణామాలు, కరోనా సెకండ్ వేవ్, ఈక్విటీ మార్కెట్ల పతనం వంటి వివిధ అంశాలు బంగారం ధరలు పెరగడానికి కారణమవుతున్నాయని తెలిపారు. ఇక మరోవైపు వెండి కూడా వెండి ధరలు కూడా కిలో రూ.67,000కు దగ్గరగా ఉంది.

బంగారం ధరలు నిన్నటి తో పోలిస్తే ఈ రోజు స్వలంగా రూ. 110 మేర పెరిగింది.
ఈ రోజు (24-08-2021 మంగళవారం) నాటికి రూ. 44,250గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. ఈరోజు రూ 44,140లకు చేరుకుంది. ఇక నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,160గా ఉండగా, ఈ రోజు రూ.48,270లుగా నమోదైంది.

ప్రధాన నగరాల్లో ధరలు:

  • హైదరాబాదులో
    22 క్యారెట్ల ధర రూ 44,250
    24 క్యారెట్ల ధర రూ. 48,270
  • విజయవాడలో
    22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,250
    24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ48,270
  • ముంబ‌యిలో 22 క్యారెట్ల ధర రూ.46,260
    24 క్యారెట్ల బంగారం ధర రూ.47,260
  • ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.46,400
    24 క్యారెట్ల ధర రూ.50,620
  • చెన్నైలో
    22 క్యారెట్ల ధర రూ.44,610
    24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,660

వెండి ధరలు:

నిన్నటి ధరలతో పోలిస్తే వెండి ధరలు కూడా స్వల్పంగానే రూ. 40మేర పెరిగింది.
నేడు (24-08-2021 మంగళవారం) వెండి 10 గ్రాములు రూ.666.60 గా ఉంది.
ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 66,600గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఈరోజు (24-08-2021 మంగళవారం) ఉదయం 6 గంటల వ‌ర‌కు ఉన్న ధరలు. స్థానిక పరిస్థితులు ఆధారంగా ఈ ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. జరిగే మార్పులను గమనించి వినియోగదారులు బంగారం నగలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

1 Comment
  1. Money Online says

    Wow, marvelous weblog format! How long have you ever been running a blog for? you made blogging look easy. The entire look of your web site is great, let alone the content material!!

Leave A Reply

Your email address will not be published.