రూ. 78 వేలు దాటి పసిడి పరుగు..

ఢిల్లీ (CLiC2NEWS): దేశంలో బంగారం ధర రూ.78వేలు దాటింది. బుధవారం 24 క్యారెట్ల పసిడి ధర రూ. 77,850 ఉండగా.. గురువారం రూ.400 పెరిగి రూ. 78,250 కి చేరింది. అంతర్జాతీయంగా పసిడికి డిమండ్ నెలకొనడం, దేశీయంగానూ వర్తకుల నుండి కొనుగోళ్లు కొనసాగుతుండటం బంగారం ధరలు పెరగడానికి కారణమని నిపుణులు వెల్లడిస్తున్నారు. మరోవైపు బంగారంతో పాటు వెండి కూడా రూ. 94వేలకు చేరింది.