ప్ర‌ధానిపై అభిమానాన్ని చాటుకున్న స్వ‌ర్ణ‌కారుడు..

ముంబ‌యి (CLiC2NEWS): ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీపై ఉన్న అభిమానంతో ఓ స్వ‌ర్ణ‌కారుడు 156 గ్రాముల‌తో బంగారు విగ్రహాన్ని త‌యారుచేశాడు. గుజ‌రాత్‌లోని సూర‌త్‌కు చెందిన సందీప్‌జైన్ మేలిమి బంగారంతో ప్ర‌ధాని విగ్ర‌హాన్ని త‌యారు చేసి త‌న అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ విగ్ర‌హం బాంబే గోల్డ్ ఎగ్జిబిష‌న్‌లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. ఈ విగ్ర‌హం త‌యారు చేయ‌డానికి దాదాపు రూ. 11 ల‌క్ష‌ల వ్య‌యం అయిన‌ట్లు తెలుస్తోంది. గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో 156 సీట్ల‌తో బిజెపి చారిత్ర‌క విజ‌యానికి గుర్తుగా 156 గ్రాముల ప‌సిడితో విగ్ర‌హాన్ని త‌యారు చేసిన‌ట్లు స‌మాచారం. ఈ విగ్ర‌హం త‌యారీకి దాదాపు 15 నుండి 20 మంది క‌ళాకారులు కొన్ని రోజులు శ్ర‌మించి త‌యారు చేశారు.

Leave A Reply

Your email address will not be published.