సిద్దిపేటలో వెంక‌టేశ్వ‌ర స్వామికి స్వ‌ర్ణ కిరీటం

సిద్దిపేట (CLiC2NEWS): వైకుంఠ ఏకాద‌శి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని సిద్దిపేట‌లోని శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి కి తెలంగాణ ఆర్థిక మంత్రి త‌న్నీరు హ‌రీష్‌రావు స్వ‌ర్ణ కిరీటాన్ని స‌మ‌ర్పించారు. సోమ‌వారం మంత్రి స్వామి వారిని సంద‌ర్శించుకొని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా స్వామి వారికి 1.792 కిలోల బంగారు కిరీటాన్ని స‌మ‌ర్పించి మొక్కును తీర్చుకున్నారు. అనంత‌రం మంత్రి హ‌రీష్‌రావుకు వేద పండితులు ఆశీర్వ‌చ‌నాలు అందించారు.

Leave A Reply

Your email address will not be published.