RRR: నాటునాటు సాంగ్‌కు గోల్డెన్‌గ్లోబ్ అవార్డు
![](https://clic2news.com/wp-content/uploads/2023/01/RRR.jpg)
కాలిఫోర్నియా (CLiC2NEWS): ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటునాటు’ పాటకు గాను ప్రతిష్టాత్మకమైన గోల్డెన్‌గ్లోబ్ అవార్డును సొంతం చేసుకుంది. ఒరిజనల్ సాంగ్ విభాగానికి గానూ ఈ పురస్కారం వరించింది. కాలిఫోర్నియాలోని ది బెవర్లీ హిల్టన్ హాల్‌లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. రాజమౌళి, రామ్‌చరణ్, ఎన్‌టిఆర్, కీరవాణి కుటుంబసమేతంగా హాజరయ్యారు. కీరవాణి ఆ బహుమతిని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ అవార్డును అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని హెచ్ ఎఫ్‌పిఎకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇది నా సోదరుడు రాజమౌళికి దక్కాలని.. పాటలో భాగస్వామ్యమైన రాహుల్ సిప్లిగంజ్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. చంద్రబోస్ రాసిన నాటునాటు పాటకు విదేశీయులను సైతం ఉర్రూతలూగించింది. ప్రపంచమంతా మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసినదే.