మధుమేహాన్ని తగ్గించే గోముఖాసనం..

ఈ ఆసనంను మోకాళ్ళను ఆవు ముఖాకారంలో ఉంచటం వలన దీనికి గోముఖాసనమ్ అని పేరు వచ్చింది.
చేసే విధానం
నెల పైన వజ్రాసనం లో ముందుగా కూర్చోవాలి. తరువాత ఎడమ కాలును మడవాలి. మడమను గుదస్థానం కింద ఉంచాలి. కుడికాలుని ఎలా మడవాలంటే కుడిముడుకుకు, ఎడమ ముడుకుకు పైన, కుడి మడమ ఎడమ పీరుద దగ్గర రావాలి. కుడి చేతిని వీపు మీద నుండి, ఎడమ చేతికి కింద నుండి తెచ్చి నడుము దగ్గర రెండు చేతుల వ్రేళ్లను పెనవేసి పట్టుకోవాలి. శ్వాసను సామాన్యంగా ఉంచాలి. మేడను తిన్నగా ఉంచాలి. కొద్దిసేపు ఈ ముద్రలో ఉండాలి. రెండో కాలుమీద కూడా ఇదే పద్ధతిని ఆవలంభించాలి. చివర పూర్తి విశ్రాంతి తీసుకోవాలి.
ఇది ధ్యానకేంద్రం. మూలదారాచక్రం.
ప్రయోజనాలు
- మధుమేహం, అతి మూత్రం వ్యాధి, దాతు నీరసం, నరాల బలహీనత, ఆయాసం, వ్యాధులు ఈ అసనం చేయటం వలన తగ్గుతుంది.
- నేర్వోస్ సిస్టం యొక్క నిరసాన్ని తగ్గించి మనసుకు స్థిరత్వాన్నిస్తుంది.
-షేక్.బహర్ అలీ
ఆయుర్వేద వైద్యుడు,
సెల్ 7396126557