గోముఖాసనం

గోముఖాసనం
ఈ ఆసనంలో మోకాళ్ళను ఆవు ముఖాకారం లో ఉంచటం వలన దీనికి గోముఖాసనం అని పేరు వచ్చింది.
చేసే విధానము:
ఎడమ కాలుని మడవాలి. మడమను గుదస్థానం కింద ఉంచాలి. కుడికాలిని ఎలా మడవాలంటే కుడి ముడుకు ఎడమ ముడుకు పైన , కుడి మడమ ఎడమ పిరుద దగ్గరకు రావాలి. కుడిచేతిని వీపు మీద నుండి, ఎడమ చేతిని కింద నుండి తెచ్చి నడుము దగ్గర రెండు చేతులు వేళ్లను పెనవేసి పట్టుకోవాలి. శ్వాసను సామాన్యంగా ఉంచాలి. మెడను తిన్నగా ఉంచాలి. కొద్దిసేపు ఈ ముద్ర లోనే ఉండాలి. రెండో కాలుమీద కూడా ఇదే పద్ధతిని అవలంబించాలి. చివర పూర్తి విశ్రాంతిని తీసుకోవాలి. ధ్యాన కేంద్రం మూలాధార చక్రం.
ప్రయోజనాలు
1.అవసరం లేని అండకోశం పెరుగుదలను ఆపుతుంది.
2. నరాల సిస్టం యొక్క నీరశాన్ని తగ్గించి మనసుని స్థిరత్వాన్ని ఇస్తుంది.
3. ధాతువుల నీరసము, లికోరియా, మధుమేహము, ఊపిరితిత్తులు, మెడ, వీపునొప్పులు, చేతి నరాలు బలహీనత, ఆయాసం లాంటి వ్యాధులను ఈ ఆసనం చక్కగా తగ్గిస్తుంది. అతిమూత్ర వ్యాధిని తగ్గిస్తుంది.
4. తొడలు,పిక్కలు,కటి ప్రదేశం,కంఠము,భుజాలు, ఉదర వ్యాధులన్నిటిని పోగొడుతుంది. ఛాతీని వెడల్పుగా చేస్తుంది.
-షేక్ బహర్ అలీ
ఆయుర్వేద వైద్యులు