4 శాతం డిఎ పెంపునకు ఆమోదం

ఢిల్లీ (CLiC2NEWS): కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డిఎ) పెంపుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. శుక్రవారం భేటీ అయిన మంత్రి వర్గం డిఎ పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇది 2023 జనవరి 1వ తేదీ నుండి వర్తిస్తుందని తెలిపారు. దీంతో ఇప్పటివరకు ఉన్న 33 % ఉన్న డిఎ 42% పెరగనుంది. డిఎ పెంపు వలన కేంద్ర ప్రభుత్వంపై రూ. 12,815 కోట్లు అదనంగా భారం పడుతుందని మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఈ నిర్ణయంతో కేంద్ర పరిధిలోని 47.58 లక్షల మంది ఉద్యోగులకు, 69.76 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.