కొత్త సంవ‌త్స‌రం.. బొగ్గుగ‌ని కార్మికులకు శుభ‌వార్త..!

గోదావ‌రిఖ‌ని (CLiC2NEWS): కొత్త సంవ‌త్స‌రంలో బొగ్గ‌గ‌ని కార్మికుల‌కు 19శాతం వేత‌నాలు పెంచ‌డానికి వేజ్‌బోర్డ్ అంగీక‌రించింది. మొద‌ట 4 (ఎఐటియుసి, సిఐటియు, బిఎంఎస్, హెచ్ ఎం ఎస్ ) కార్మిక సంఘాలు 28 % ఎంజిబి చెల్లించాల‌ని డిమాండ్ చేశారు. కాని బొగ్గు గ‌ని కార్మికుల 11వ వేత‌న ఒప్పందం 19% శాతం పెదుగుద‌ల‌తో ఖ‌రారైంది. ఈ నాలుగు సంఘాల‌లో హెచ్ ఎంఎస్ మాత్రం 28 % నుండి దిగివ‌చ్చి.. 20% ఇవ్వాల‌ని ప‌ట్ట‌బ‌ట్టింది. కానీ కోల్ ఇండియా యాజ‌మాన్యం 12% నుండి పెంచుకుంటూ వ‌చ్చి 19% అంగీక‌రించింది.

పెరిగిన వేత‌నాల ప్ర‌కారం మొద‌టి క్యాట‌గిరీ కార్మికుడికి రూ. 6,973.73 పెరుగుద‌ల ఉంటుంద‌ని తెలుస్తొంది. 10వ వేత‌న ఒప్పందం ప్ర‌కారం మొద‌టి క్యాట‌గిరీ కార్మికుడికి రూ. 4,800 పొంద‌గా.. 11వ ఒప్పందం ప్ర‌కారం దాదాపు రూ.7 వేల వ‌ర‌కు ఉంటుంద‌ని సమాచారం.

Leave A Reply

Your email address will not be published.