ఇపిఎస్ పెన్షన్ దారులు ఇక ఎక్కడినుండైనా పెన్షన్ పొందవచ్చు
ఢిల్లీ (CLiC2NEWS): ఇపిఎస్ పెన్షన్ దారులకు శుభవార్త. ఇక ఎక్కడనుండైనా పెన్షన్ పొందే అవకాశాన్ని ఇపిఎఫ్ఒ కల్పించింది. దేశంలోని ఎక్కడి నుండైనా.. ఏ బ్యాంక్ నుండైనా పెన్షన్ తీసుకునేందుకు అవకాశం కల్పించింది. దీంతో 68 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. దీనికోసం సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్‌ను (CPPS) దేశంలోని అన్ని ప్రాంతీయ కార్యాలయాలకు విస్తరించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో దేశంలోని ఏ ప్రాంతానికి మారినా ఇబ్బంది ఉండదు. ఏ బ్యాంక్‌కు చెందిన ఏ శాఖ నుండైనా పింఛన్ పొందవచ్చు. రిటైర్మెంట్ అనంతరం సొంత ప్రాంతాలకు వెళ్లి స్థిరపడే వారికి ఈ సెంట్రలైజ్డ్ వ్యవస్థ ప్రయోజనకరంగా ఉండనున్నట్లు సమాచారం. ఈ విధానం ముందుగా అక్టోబర్‌లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించగా.. జనవరి 1 నుండి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చినట్లు సమాచారం.