రైతులకు గుడ్న్యూస్,,
హైదరాబాద్ (CLiC2NEWS): రైతులకు శుభవార్తం. రైతు బంధు సాయం పంపిణీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. రాష్ట్రంలొ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రైతు బంధు సాయం పంపిణీకి అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇసి దృష్టికి తీసుకెళ్లింది. దీనిని పరిశీలించిన అధికారులు పాత పథకమే కదా అని పంపిణీకి అనుమతిచ్చారు. ఈనెల 30 వ తేదీన ఎన్నికలు ఉన్నందున 28 లోపు మాత్రమే రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయాలని ఇసి సూచించింది. అడ్డంకులు తొలగిపోవడంతో త్వరలోనే రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నిధులు జమవుతాయి.