రైతన్నలకు గుడ్‌న్యూస్: కేంద్ర కేబినేట్

ఢిల్లీ (CLiC2NEWS): కేంద్ర కేబినేట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని నరేంద్రమోడి అధ్యక్షతన మంత్రివర్గం బుధవారం సమావేశమైంది. రైతులకు గోధుమ సహా 6 పంటలకు ఎమ్ ఎస్‌పి పెంపుకు ఆమోదం తెలిపింది. రైతుల ఆదాయం పెంచే లక్ష్యంగా పిఎం అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్ (PM-AASHA) కు రూ. 35 వేల కోట్లు ఇచ్చేందుకు ఆమోద ముద్ర వేసింది. రబీ పంట సీజన్‌కు సంబంధించి నాన్-యూరియా ఎరువులకు రూ. 24,475 కోట్ల సబ్సిడీ ఇవ్వనుంది. 2025-26 మార్కెటింగ్ సీజన్‌కు గాను రబీ పంటలకు కనీస మద్దతు ధర (ఎమ్ఎస్‌పి)ను పెంచింది. క్వింటాల్ గోధుమపై ఎమ్ఎస్‌పిని తాజాగా రూ. 150కి పెంచింది. దీంతో గతంలో ఉన్న కనీస మద్దతు ధర రూ.2275 ఉండగా.. తాజా పెంపుతో రూ. 2425కి పెరిగింది.