ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..

ఢిల్లీ (CLiC2NEWS): ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర సర్కార్ శుభవార్తనందించింది. ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా డిఎను 3% పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం వెల్లడించారు. దీంతో వారికి ఇప్పటి వరకు ఉన్న 50% డిఎ 53%కి చేరుతుంది. ఈ ఏడాది మార్చిలో డిఎను 4% కు పెంచారు. తాజాగా పెంచిన డిఎతో కలిపి ఈ ఏడాది జులై 1 నుండి అమలు చేయనున్నట్లు సమాచారం. దీనివల్ల కేంద్ర ఖజానాపై రూ.9448 కోట్ల అదనపు భారం పడనుంది.