కెజిబివి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

హైదరాబాద్ (CLiC2NEWS): సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ), కెజిబివి ల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు తెలంగాణ సర్కారు గుడ్‌న్యూస్ చెప్పింది. ఆయా ఉద్యోగుల వేతనాలను 30 % పెంచుతూ శనివారం విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా జీవో -117ను జారీచేశారు. ఈ పెరిగిన వేతనాలను జూన్ 1, 2021 నుంచి వర్తింపజేయనున్నారు.