మద్యం షాపు యజమానులకు శుభ‌వార్త‌.. లైసెన్సులు నెల రోజులు గడువు పొడిగింపు

హైదరాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలోని ఏ-4 మద్యం దుకాణాల లైసెన్సులను ప్రభుత్వం పొడిగించింది. వచ్చే నెలాఖరుతో గడువు దుకాణాల గడువు ముగియాల్సి ఉన్నది. ఈ క్రమంలో నవంబర్‌ 1 నుంచి 30వ తేదీ వరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే మద్యం పాలసీపై విధి విధానాలు రూపొందించేందుకు ఆబ్కారీశాఖ మంత్రి అధికారులను ఆదేశించారు. 2021-22 సంవత్సరానికి వైన్స్‌, బార్‌ లైసెన్స్‌లకు సంబంధించిన నిబంధనలు తయారు చేయాలని సూచించారు.

రాష్ట్రంలో నవంబర్ 1వ తేదీతో ఇప్పుడున్న 2,216 రిటైల్ లిక్క‌ర్ షాపుల లైసెన్సులు ముగియ‌నున్నాయి. ఈ లైసెన్సులు ముగిసిన త‌రువాత మ‌ద్యం షాపుల వేలం ప్ర‌క్రియ ఉంటుంది. 2019 -21 సంవత్సరానికి రాష్ట్రంలో రిటైల్ మద్యం షాపుల లైసెన్సులను మరో నెల రోజుల పాటు పొడిగిస్తూ స‌ర్కార్‌ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రొహిబిషన్, ఎక్సయిజ్ శాఖ పంపిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదిలా ఉండగా.. ప్రభుత్వం మద్యం దుకాణాల్లో గౌడ కులస్థులకు 15శాతం, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించిన విషయం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.