మందుబాబులకు శుభవార్త!
హైదరాబాద్ (CLiC2NEWS): డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులు తెరిచే ఉండనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం నూతన సంవత్సరం సందర్భంగా మద్యం విక్రయ సమయం పొడిగించింది. డిసెంబర్ 31వ తేది అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతినిచ్చింది. అదేవిధంగా 31న రాత్రి ఒంటి గంట వరకు ఈవెంట్ల నిర్వహణకు ప్రత్యేక అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈవెంట్ల నిర్వహణకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి ఎక్సైజ్ శాఖ తాత్కాలిక లైసెన్స్‌లు జారీ చేయనుంది. ఈవెంట్లలో పాల్గొనేవారి సంఖ్యను బట్టి లైసెన్స్ ఫీజు రూ. 50 వేల నుండి 2.5 లక్షలుగా నిర్ణయించింది.