పెండింగ్ చలాన్ల వాహనదారులకు శుభవార్త!
హైదరాబాద్ (CLiC2NEWS): ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారు ఈ-చలాన్లు కట్టకుండా పెండింగ్‌లో పెట్టిన వాహనదారులకు హైదరాబాద్ పోలీసులు శుభవార్త చెప్పారు. కరోనా కారణంగా ప్రజలు ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పెండంగ్ చలాన్లో రాయితీని ఇవ్వాలని పోలీసులు నిర్ణయించారు. ఈమేరకు పోలీస్ శాఖ వచ్చేనెల 1వ తేదీనుండి 30వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనుంది.
ద్విచక్ర వాహనదారుల చలాన్ మొత్తంలో 25% చెల్లించేందుకు అవకాశం ఇచ్చింది. మిగిలిన 75% పోలీస్ శాఖ మాఫీ చేయనుంది. అదేవిధంగా కార్లకు 50%, ఆర్టీసీ బస్సులకు 30%, తోపుడు బండ్లకు 20% చెల్లింపుకు అవకాశం ఇచ్చింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిదిలో మొత్తం రూ. 600 కోట్లకు పైగా పెండింగ్ ఛలాన్లు ఉన్నాయి. వీటిని క్లియర్ చేసేందుకు ఈ కొత్త ప్రతిపాదన తీసుకువచ్చింది. ఈ పెండింగ్ ఛలాన్లుపై గత కొన్నిరోజుల నుండి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, ఇతర ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు.