సింగరేణిలో కారుణ్య నియామకాలకు వయోపరిమితి పెంపు..

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిలో కారుణ్య నియామక ఉద్యోగార్థులకు శుభవార్తనందించింది. కారుణ్య నియామకాలకు వయోపరిమితిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. వారసుల గరిష్ట వయోపరిమితిని 35 ఏళ్ల నుండి 40 ఏళ్లకు పెంచుతూ సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని 2018 మార్చి9 నుండి అమలు చేయనున్నట్లు సింగరేణి వెల్లడించింది.