శ్రీ‌వారి భ‌క్తుల‌కు శుభ‌వార్త‌

ఆర్జిత సేవ‌ల్లో పాల్గొనేందుకు టిటిడి అనుమ‌తి

తిరుమ‌ల (CLiC2NEWS): తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఏప్రిల్ 1 నుంచి ఆర్జిత సేవ‌ల‌కు భ‌క్తుల‌కు అనుమ‌తించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. కొవిడ్ నేప‌థ్యంలో 2020 మార్చి నుంచి భ‌క్తుల‌కు అనుమ‌తించ‌కుండా ఏకాంతంగా ఆర్జిత సేవ‌లు నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం కొవిడ్ మ‌హమ్మారి కేసుల న‌మోదు భారీగా త‌గ్గిన నేప‌థ్యంలో రెండు సంవ‌త్స‌రాల త‌ర్వాత మ‌ళ్లీ భ‌క్తుల‌కు అవ‌కాశం క‌ల్పించారు. ఏప్రిల్‌, మే, జూన్ నెల‌ల‌కు గాను సంబంధిత ఆర్జిత సేవా టికెట్ల‌ను మ‌ర్చి 20 ఉద‌యం 10 గంట‌లకు ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయుంది. భ‌క్తులు tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవ‌చ్చ‌ని టిటిడి ప్ర‌క‌న‌లో పేర్కొంది.

సుప్ర‌భాతం, తోమాల‌, ఆర్చ‌న‌, అష్టాద‌శ‌పాద‌ప‌ద్మారాధ‌న‌, న‌జ‌పాద ద‌ర్శ‌నం టెకెట్ల‌ను ఆన్‌లైన్ ఎల‌క్ట్రానిక్ డిప్ విధానంలో కేటాయిస్తారు. ఏప్రిల్‌, మే, జూన్ నెల‌ల‌కు గాను సంబంధిత ఆర్జిత సేవా టికెట్ల‌ను మ‌ర్చి 20 ఉద‌యం 10 గంట‌లకు ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయుంది.

ఏప్రిల్ 2న ఉగాది సంద‌ర్భంగా క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్ సేవ, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం,

ఏప్రిల్ 10న శ్రీ‌రామ‌న‌వ‌మి సంద‌ర్భంగా తోమాల‌, ఆర్చ‌న‌, స‌హ‌స్త్ర దీపాలంక‌ర‌ణ సేవ‌ల‌ను టిటిడి ర‌ద్దు చేసింది.
వసంతోత్స‌వాల సంద‌ర్భంగా ఏప్రిల్ 14 నుంచి 16 వ‌ర‌కు క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్ సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్త్రదీపాలంక‌ర సేవ‌ల‌ను, ఏప్రిల్ 15న నిజ‌పాద ద‌ర్శ‌నం, సేవ‌ల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు అధికారులు తెలిపారు.

అలాగే శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వ‌చ్చేభ‌క్తుల‌కు కొవిడ్ నెగ‌టివ్ స‌ర్టిఫికెట్, రెండు డోసుల వ్యాక్సినేష‌న్ స‌ర్టిఫికెట్ కానీ త‌ప్ప‌నిస‌రిగా తీసుకురావాల‌ని టిటిడి విజ్ఞ‌ప్తి చేసింది.
మార్చి 18న పౌర్ణమి గరుడ సేవ

తిరుమల, 2022 మార్చి 17: పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 18న గరుడసేవ జరుగనుంది. ఈ రోజు పాల్గుణ పౌర్ణ‌మి కావ‌డం విశేషం. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టిటిడి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

Leave A Reply

Your email address will not be published.