ఈ నెల 21న రెండో విడత డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ..

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంలోని పేదలకు శుభవార్త అందించింది. నగరంలో రెండో విడత డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ ఈ నెల 21వ తేదీన అందించనున్నట్లు తెలిపింది. రెందో దశలో దాదాపు మరో 13,300 ఇళ్లను పేదలకు పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ప్రకటించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ విషయంపై సచివాలయంలో రాష్ట్ర మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రలు సబితా, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లతో మంత్రి కెటిఆర్ సమీక్ష నిర్వహించారు.