నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌.. మ‌రో 10,105 ఉద్యోగాల భ‌ర్తీకి అనుమ‌తి

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ స‌ర్కార్ నిరుద్యోగుల‌కు శుభ‌వార్త చెప్పింది. రాష్ట్రంలో కొత్త‌గా మ‌రో 10,105 ఉద్యోగాల భ‌ర్తీకి అన‌మ‌తి మంజూరు చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇందులో గురుకులాల్లోనే మొత్తం 9,096 పోస్టులు ఉన్నాయి.

  • మైనార్టీ గురుకుల విద్యాల‌యాల సంస్థ‌ల్లో 1,445 పోస్టులు
  • బిసి గురుకులాల్లో 3,870
  • గిరిజ‌న కురుకులాల్లో 1,514
  • ఎస్సీ గురుకులాల్లో 2,267 పోస్టుల భ‌ర్తీకి అనుమ‌తి ఇచ్చింది.
    ఈ పోస్టులన్నింటినీ గురుకుల విద్యాల‌యాల నియామ‌క బోర్డు ద్వారా భ‌ర్తీ చేయ‌నున్నారు.

 

ఎస్సీ అభివృద్ధి శాఖ‌లో 316, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌లో 251, బిసి సంక్షేమ శాఖ‌లో 157, గిరిజ‌న సంక్షేమ శాఖ‌లో 78, దివ్యాంగ‌శాఖ‌లో 71, జువైన‌ల్ వెల్ఫేర్‌లో 66 పోస్టులు స‌హా ఇత‌ర 995 పోస్టులను టిఎస్ పిఎస్ సి ద్వారా భ‌ర్తీ చేయ‌నున్నారు. మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌లో జిల్లా ఎంపిక క‌మిటీ ద్వారా మ‌రో 14 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు వివిధ శాఖ‌ల్లో ఉన్న 45,325 ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీకి స‌ర్కారు అనుమ‌తి ఇచ్చింది.

 

Leave A Reply

Your email address will not be published.