ప‌ర్యాట‌కుల‌కు గుడ్‌న్యూస్‌.. త‌గ్గ‌నున్న భార‌త్‌గౌర‌వ్ రైలు టికెట్ ధ‌ర‌లు!

ఢిల్లీ (CLiC2NEWS): భార‌త్ గౌర‌వ్ రైళ్ల‌ టికెట్ ధ‌ర‌ను 30% వ‌ర‌కు త‌గ్గించాల‌ని ఐఆర్‌సిటిసి నిర్ణ‌యించింది. భార‌త్‌లో ప‌ర్యాట‌కుల కోసం ప్ర‌త్యేకంగా రైల్వేశాఖ‌ భార‌త్ గౌర‌వ్‌ రైళ్ల‌ను ఏర్పాటు చేశాయి. అయితే వీటికి అనుకున్నంత డిమాండ్ రాక‌పోవ‌డంతో.. ఐఆర్‌సిటిసి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. భార‌త్‌గౌర‌వ్ రైళ్ల‌ను గ‌త ఏడాది రైల్వేశాఖ ప్రారంభించిన విష‌యం తెలిసిన‌దే.

భార‌తదేశ వార‌స‌త్వం సంప‌ద‌, చారిత్ర‌క ప్ర‌దేశాలు యాత్ర స్థ‌లాలు సంద‌ర్శించాల‌నే ఆస‌క్తి గ‌ల వారికి ఈ రైళ్లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. రామాయ‌ణ్ స‌ర్క్యూట్ కింద ఢిల్లీ నుండి ప్రారంభ‌మ‌య్యే రైలు.. ప‌లు చారిత్ర‌క ప్ర‌దేశాల మీదుగా నేపాల్ చేరుతుంది. ఈ యాత్ర మొత్తం 18 రోజులు ఉంటుంది. థ‌ర్డ్ ఎసి క్లాస్ టికెట్ ధ‌ర రూ. 62 వేలు ఉండ‌టంతో మొదట్లో కొంత డిమాండ్ ఉన్న‌ప్ప‌టికీ రానురాను ర‌ద్దీ తగ్గింది. దీంతో టికెట్ ధ‌ర‌ల‌ను త‌గ్గించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం.

ఇటీవ‌ల ప‌ర్యాట‌కుల కోసం భార‌త్ ద‌ర్శ‌న్ రైళ్ల‌ను కూడా ప్రారంభించారు. ఈ రైళ్లలో 18 రోజుల ప్ర‌యాణానికి రూ. 27వేలు వ‌రకు ఉంది. స్లీప‌ర్‌కు ఒక్కో రోజు టికెట్ ధ‌ర రూ. 900, థ‌ర్డ్ ఎసి టికెట్ ధ‌ర రూ. 1500 గా ఉంది.

3 Comments
  1. indirapuram call girls says

    Hello, I read your new stuff daily. Your humoristic style is witty, keep doing what you’re
    doing!

  2. junk car says

    I’m really loving the theme/design of your site. Do you ever
    run into any web browser compatibility issues?
    A couple of my blog readers have complained about my site not operating correctly in Explorer
    but looks great in Chrome. Do you have any recommendations to help
    fix this issue?

  3. rytr review says

    I enjoy what you guys are usually up too. This sort
    of clever work and coverage! Keep up the terrific works guys I’ve added you guys to our blogroll.

Leave A Reply

Your email address will not be published.