టిటిడి ఉద్యోగులకు శుభ‌వార్త ..

తిరుమ‌ల (CLiC2NEWS): తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఉద్యోగుల‌కు శుభ‌వార్త తెలిపింది. త‌మ ఉద్యోగుల‌కు ఇళ్ల ప‌ట్టాలు పంపిణీ చేయాల‌ని ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ స‌మావేశం సంద‌ర్భంగా గోవింద నామ‌కోటి పుస్తాకాల‌ను టిటిడి ఛైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి విడుద‌ల చేశారు. 5 భాష‌ల్లో ప్ర‌చురించిన భ‌వ‌ద్గీత పుస్త‌కాల‌ను ఆయ‌న ఆవిష్కరించారు.

టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు చేశారు. పీస్ రేట్ క్షుర‌కుల క‌నీస వేత‌నం రూ. 20వేల‌కు పెంపు.. లడ్డూ పోటులోని కార్మికులకు అద‌నంగా రూ. 10వేల వేత‌నం పెంచే ప్ర‌తిపాద‌న‌కు మండ‌లి ఆమోదం తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.