గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త
అమరావతి (CLiC2NEWS): కొత్త పిఆర్‌సి కోసం వేచి చూస్తున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. ప్రొబేషన్ డిక్లరేషన్‌కు సర్కార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకొని, డిపార్ట్‌మెంటల్ పరీక్షలో ఉత్తీర్ణులైన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేయనున్నారు. ఈ అధికారాన్ని ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించారు. ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి జగన్ సంతకం చేశారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఒకటి, రెండు రోజుల్లో వెలువడనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40వేల మందికి పైగా సచివాలయ ఉద్యోగులు ఎపిపిఎస్‌సి నిర్వహించిన డిపార్ట్‌మెంటల్ పరీక్షలో ఉత్తీర్ణలైనట్టు సమాచారం.
సచివాలయ ఉద్యోగులకుపాత స్కేల్ ప్రకారమే జీతాలు ఇవ్వాలని ఆర్ధిక శాఖ నిర్ణయించింది. కానీ జులై నెల వేతనాలు కొత్త పిఆర్‌సి ప్రకారమే ఇవ్వాలని సిఎం ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రొబేషన్ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు మాత్రమే కొత్త వేతనాలు అందనున్నాయి.