AP: మాతృత్వ సెలవులు పెంపు..

అమరావతి (CLiC2NEWS): మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఎపి ప్రభుత్వం మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ అందించింది. ఇప్పటి వరకు ఉన్న 120 రోజుల మాతృత్వ సెలవులను 180 రోజులకు పెంచింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాక గతంలో మాతృత్వ సెలవులు ఇద్దరు పిల్లల వరకు మాత్రమే వర్తించేవి. ఇపుడు తాజగా ఆ నిబంధనలు ఎత్తివేసినట్లు సమాచారం.