యూట్యూబ్ షార్ట్స్ మేక‌ర్స్‌కు శుభ‌వార్త‌..

YouTube Shorts: యూట్యూబ్ షార్ట్స్ లో కీల‌క అప్‌డేట్‌.. షార్ట్స్‌ వీడియో నిడివి ఒక నిమిషం నుండి మూడు నిమిషాల‌కు పెంచుతూ ప్ర‌ముఖ వీడియో ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ కీల‌క అప్‌డేట్ తీసుకొచ్చింది. ఇక‌పై కంటెంట్ క్రియేట‌ర్లు మూడేసి నిమిషాల నిడివి గ‌ల వీడియోల‌ను ఆప్‌లోడ్ చేసుకొనే వెసులు బాటును తీసుకొస్తున్న‌ట్లు ప్ర‌కటించింది. ఇది అక్టోబ‌ర్ 15 నుండి అందుబాటులోకి రానుంది. ఇప్ప‌టి వ‌ర‌కు యూట్యూబ్ షార్ట్స్ కేవ‌లం ఒక నిమిషం లోపు వీడియోల‌ను మాత్ర‌మే మ‌నం చూస్తున్నాం. ఇక నుండి 3 నిమిషాల పాటు వీడియోలో స‌మ‌గ్ర కంటెంట్ అంద‌నుంది.

కంటెంట్ క్రియేట‌ర్ల నుండి వ‌స్తున్న విజ్ఞ‌ప్తుల మేర‌కు తాజాగా వీడియో నిడివి పెంచేందుకు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో పాటు కంటెంట్ క్రియేష‌న్‌కు సంబంధించి మ‌రికొన్ని కొత్త ఫీచ‌ర్ల‌ను యూట్యూబ్ ప్ర‌కటించింది. కొత్త‌గా టెంప్లేట్ ఆప్ష‌న్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా ట్రెండింగ్ వీడియోల‌ను రీమిక్స్ బ‌ట‌న్ ద్వారా కొత్త వీడియోగా రీ క్రియేట్ చేయోచ్చు. ట్రెండింగ్, పాపులర్ వీడియోల‌కు ప‌ర్స‌న‌ల్ ట‌చ్ ఇవ్వ‌డంలో కంటెంట్ క్రియేట‌ర్ల‌కు ఈ ఫీచ‌ర్ ఉప‌యోగ‌ప‌డుతుంది. అలాగే, యూట్యూబ్ కంటెంట్‌ను షార్ట్స్‌గా మ‌లిచేందుకు రానున్న కొన్ని రోజుల్లో కొత్త ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.