ప్రయాణీకులకు శుభవార్త: పండక్కి అదనపు ఛార్జీలు లేవు

హైదరాబాద్ (CLiC2NEWS): దసరా పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లాలనుకునే వారికి TSRTC శుభవార్త తెలిపింది. పండుగ సందర్భంగా నడిపే ప్రత్యేక అర్టీసీ బస్సులకు అదనపు ఛార్జీలు వసూలు చేయడంలేదని TSRTC ఎండి విసి సజ్జనార్ తెలిపారు. ప్రయాణికుల సౌకర్యం భద్రతే ధ్యేయంగా ఆర్టిసి నేవలు అందిస్తోందని , ప్రయాణికులు చూపించే ఆదరాభిమనాలే సంస్థ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తాయని ఆయన అన్నారు. ఆర్టిసి బస్సల్లో ప్రయాణం చేసి ప్రజలు అందరూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. అలాగే దసరా కోసం ఈ ఏడాది ప్రత్యేకంగా 4035 బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. గత 5 రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి 30 లక్షల మంది ప్రయాణికులను క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేర్చినట్లు సజ్జనార్ పేర్నొన్నారు.
అధిక చార్జీలు లేకుండా RTC ప్రయాణం@tsrtcmdoffice@Govardhan_MLA pic.twitter.com/k6D7JH1vXt
— TSRTC (@TSRTCHQ) October 10, 2021