Good News: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు

ఢిల్లీ (CLiC2NEWS): దేశంలో ప్రజలు ఇంధన ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా శుభవార్తనందించింది. చమురు, గ్యాస్‌పై పన్నులు తగ్గించింది. లీటరు పెట్రోల్‌పై రూ. 8, డీజిల్‌పై రూ. 6 ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ తాజా తగ్గింపుతో లీటరు పెట్రోల్‌పై రూ. 9.50లు, డీజిల్‌పై రూ. 7 తగ్గే అవకాశం ఉంది. మరోవైపు, పిఎం ఉజ్వల్ యోజన పథకం కింద 9 కోట్ల మంది లబ్ధిదారులకు ఒక్కో సిలిండర్‌పై రూ. 200 రాయితీ ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఐరన్, స్టీల్‌పై కస్టమ్స్ డ్యూటీని కేంద్రం తగ్గించింది. ప్లాస్టిక్ ఉత్పత్తులు, ముడి పదార్థాలతో పాటు ఉక్కు ముడి పదార్థాలపై దిగుమతి సుంకం తగ్గించనున్నట్లు తెలిపింది.