బిజెపికి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా

హైదరాబాద్ (CLiC2NEWS): భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో భారీ షాక్. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి కి గుడ్‌బై చెప్పారు. ఆయన త్వరలో కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
రాజగోపాల్ రెడ్డి గత పదిహేను నెలల కిందట కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. మునుగోడులో జరిగిన ఎన్నికల్లో బిజెపి తరఫున పోటీచేసి ఓడిపోయారు. తాజాగా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించడం రాష్ట్రంలో చర్చనీయంశం అయింది.
“ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. బిఆర్ ఎస్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను ప్రజలు భావిస్తున్నారు. వారి ఆలోచనల మేరకు నేను వ్యవహరించాలని నిర్ణయించుకున్నాను.“ అని రాజగోపాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.