జన్మలో ఇక రాజకీయాల గురించి మాట్లాడను.. పోసాని సంచలన నిర్ణయం
హైదరాబాద్ (CLiC2NEWS): సినీనటుడు పోసాని మురళీకృష్ణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.జన్మలో ఇక రాజకీయాల గురించి మాట్లాడను.. అంటూ సంచలన ప్రకటన చేశారు. ఇటీవల ఆయనపై సిఐడి కేసు నమెదు చేశారు. ఎపి సిఎం చంద్రబాబు, డిప్యూటి సిఎం పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌ను అసభ్య పదజాలంతో దూషించారన్న అభియోగాలపై ఆయనపై పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన మీడియా సమేవేశంలో మాట్లాడుతూ.. 1983 నుండి రాజకీయాలపై మాట్లాడుతున్నానని, ఇక నుండి నా జీవితకాలం నేను రాజకీయాలు మాట్లాడను, వాటి ప్రస్తావన తీసుకురానన్నారు.
ఇక నుండి ఏ పార్టీని పొగడను, మద్దతు తెలపను, విమర్శించనని పోసాని అన్నారు. నాపై కేసులు పెడుతున్నారని ఇపుడు ఈ విధంగా మాట్లాడటం లేదు. 16 ఏళ్ల పిల్లల నుండి 70ఏళ్ల వృద్దులు వరకు అసభ్య పదజాలంతో తిడుతున్నారని పోసాని తెలిపారు. నేను రాజకీయ పార్టి నాయకుల నీతి, నిజాయతీలు, నడవడికను బట్టి కామెంట్స్ చేస్తా తప్ప,మంచి నాయకుడిని విమర్శించలేదు. ప్రధాని మోడీ నాకు ఎప్పటి నుండో తెలుసు. ఆయన జీవితంలో అవినీతి లేదు. ఆయన మంత్రి స్తాయి నుండి ప్రధాని వరకు ఎదిగారు. ఆయన కోట్లు కూడబెట్టుకున్నారని ఎవరైనా అన్నారా అంటూ ప్రశ్నించారు. ఎపిలో చంద్రబాబు, జగన్, రాజశేఖర్‌రెడ్డి, ఎన్‌టిఆర్ అందరినీ వారి గుణగణాలను సపోర్ట్ చేశానన్నారు. తప్పులు చేసినవారందరినీ విమర్శించా. నేను ఎక్కువగా పొగొడింది నారా చంద్రబాబునాయుడినేనన్నారు. శ్రావణమాసం సినిమా సమయంలో ఆయనకు 100 అడుగుల కటౌట్ కట్టించానని తెలిపారు. ఆయన నన్ను, నా కుమారులను దీవించారని, ఆయన మంచి పనులపై
పేపర్‌లో రాశానని తెలిపారు. ఆయన తప్పులు విమర్శించినపుడు తంటా వచ్చిందన్నారు. తనకు ఎంపి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానన్నా.. వద్దని చెప్పానని పోసాని అన్నారు.