GoodNews: తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ (CLiC2NEWS): పసిడి ప్రియులకు శుభవార్త. ఈ మధ్య కాలంలో తగ్గుతూ వస్తున్నాయి. బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. దేశీయంగా మార్కెట్లు తిరిగి పుంజుకోవడంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. దేశ రాజధాని న్యూ ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,248 నుంచి రూ. 48,475కు తగ్గింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,111 నుంచి రూ.44,403కు పడిపోయింది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.240 తగ్గి రూ.45,740కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గి రూ.49,890కి చేరిది. చాలా కాలం తర్వాత 24 క్యారెట్ల బంగారం ధర రూ.50 వేల దిగువకు చేరింది.