గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ సేల్స్ షురూ.. రూ.10 వేల వరకు డిస్కౌంట్

Google Pixel 9: ఆగస్టు 14న విడుదలైన గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఫోన్ల అమ్మకాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 14 నుండే బుకింగ్ ప్రారంభం కాగా.. నేటి నుండి పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రొ ఎక్స్ఎల్ విక్రయాలు కొనసాగుతాయి. ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ ప్లిప్కార్డు సహా క్రోమా, రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో వీటిని కొనుగోలు చేయవచ్చు.
పిక్సెల్ 9 ధరను భారత్లో రూ. 79,999గా గూగుల్ నిర్ణయించింది. 12 జిబి ర్యామ్, 256 జిబి స్టోరేజితో ఇది అందుబాటులో ఉంది. రిలయన్స్ డిజిటల్లో పిక్సెల్ 9 ను ఎస్బిఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసేవారికి రూ. 5వేలు వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
పిక్సెల్ 9 ప్రొ ఎక్స్ ఎల్ ధర రూ. 1,24,999 గా ఉంది. ఇది 16జిబి ర్యామ్, 256 జిబి స్టోరేజితో అందుబాటులోకి వచ్చింది. దీనిని ఎస్బిఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ. 10,000 వరకు డిస్కౌంట్ వస్తుంది.