విశాఖ‌లో గూగుల్ వ్యూహాత్మ‌క పెట్టుబ‌డులు

సిఎం స‌మ‌క్షంలో గూగుల్ ప్ర‌తినిధులు ఒప్పందంపై సంత‌కాలు చేశారు.

అమ‌రావ‌తి (CLiC2NEWS): గూగుల్ గ్లోబ‌ల్ నెట్‌వ‌ర్కింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ సంస్థ ఎపిలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకొచ్చింది. బుధ‌వారం సిఎం చంద్ర‌బాబు స‌మ‌క్షంలో ఆ సంస్థ ఉపాధ్య‌క్షుడు బికాశ్ కోలే నేతృత్వంలో ప్ర‌తినిధి బృందం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును క‌లిసింది. రాష్ట్రంలో ప‌టిష్ట‌మైన టెక్నాల‌జి ఎకో సిస్ట‌మ్ ఏర్పాటు చేయ‌డం ద్వారా యువ‌త‌కు ఉపాధి అవకాశాలు క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్యంగా గూగుల్ సంస్థ‌తో ప్ర‌భుత్వం అవ‌గాహ‌న ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్ర ఐటి రంగంలో విప్ల‌వాత్మ‌క మార్పులు రానున్న‌ట్లు సిఎం పేర్కొన్నారు. ఉపాధి అవ‌కాశాలు మెరుగుప‌డ‌తాయ‌ని అన్నారు. సిఎం స‌మ‌క్షంలో గూగుల్ ప్ర‌తినిధులు ఒప్పందంపై సంత‌కాలు చేశారు.

ఈ సంద‌ర్భంగా గూగ‌ల్ సంస్థ ప్ర‌తినిధి మాట్లాడుతూ.. గూగుల్‌కు ఎపి కీల‌క భాగ‌స్వామ్య రాష్ట్రమ‌ని, భ‌విష్య‌త్తులో కొత్త కార్య‌క‌లాపాల‌ను చేప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని కోలే ఆశాభావం వ్య‌క్తం చేశారు.

అమెరికా ప‌ర్య‌ట‌న‌లో గూగుల్ ఉన్న‌త‌స్థాయి ప్ర‌తినిధుల‌తో జ‌రిపిన చర్చ‌లు స‌ఫ‌ల‌మయ్యాయ‌ని.. రాష్ట్రంలో కూటమి ప్ర‌భుత్వం రావ‌డంతో పెట్టుబ‌డుదారుల్ల న‌మ్మ‌కం పెరిగింద‌ని మంత్రి లోకేశ్ తెలిపారు. గూగుల్ సంస్థ పెట్టుబ‌డుల‌కు విశాఖ కేంద్రంగా మార‌నుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.