కేంద్ర సాహిత్య అకాడ‌మీ అవార్డు అందుకున్న గోర‌టి వెంక‌న్న‌

న్యూఢిల్లీ (CLiC2NEWS): ప్ర‌ముఖ తెలంగాణ క‌వి, ర‌చ‌యిత, తెలంగాణ రాష్ట్ర స‌మితి ఎమ్మెల్సీ గోర‌టి వెంక‌న్న రాసిన `వ‌ల్లంకి తాళం` క‌వితా సంపుటికి గాను 2020-21వ సంవ‌త్స‌రానికి కేంద్ర సాహిత్య అవార్డు వ‌రించిన విష‌యం తెలిసిందే.

గోర‌టి వెంక‌న్న కేంద్ర సాహిత్య అకాడ‌మీ అవార్డును ఇవాళ (శుక్ర‌వారం) అంద‌కున్నారు. ఇవాళ న్యూఢిల్లీలో జ‌రిగిన అవార్డుల ప్ర‌దానోత్స‌వం కార్య‌క్ర‌మంలో కేంద్ర సాహిత్య అకాడ‌మీ చైర్మ‌న్ చంద్ర‌శేఖ‌ర‌న్ చేతుల మీదుగా ఈ అవార్డును గోర‌టి వెంక‌న్న అందుకున్నారు.

నాగ‌ర్ క‌ర్నూలు జిల్లా గౌరారంలో 1963లో జ‌న్మించిన గోర‌టి వెంక‌న్న ఎన్నో గొప్ప ప‌ల్లెపాట ర‌చ‌న‌లు చేశారు. అలాగే ఏకునాదం మోత‌, రేల‌పూత‌లు, అల సెంద్ర‌వంక‌, పూసిన పున్న‌మి ఇలా ప‌లు పుస్త‌కాల‌ను ర‌చించారు.

Leave A Reply

Your email address will not be published.