AP: నిండు కుండలా గొట్టా బ్యారేజీ
శ్రీకాకుళం (CLiC2NEWS): గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఆంధ్ర ప్రదేశ్‌లో ని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. విస్తారంగా కురిసిన వర్షాలతో వంశధార నదికి వరద ఉధృతి పెరిగింది. దీంతో శ్రీకాకుళం జిల్లాలోని హిరమండలం గొట్టా బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు బుధవారం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో 43 క్యూసెక్కులుగా నమోదైంది. దీంతో వచ్చిన వరద నీటిని అధికారులు 18 గేల్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు.