9 నెలల క్రితం మిస్సయిన అమ్మాయి కేసు.. 48 గంటల్లో ఆచూకీ: డిప్యూటి సిఎం

కాకినాడ (CLiC2NEWS): ఎపిలో 9 నెలల క్రితం మిస్సయిన అమ్మాయి కేసును డిప్యూటి సిఎం పవన్‌కల్యాణ్ చొరవతో పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. కాకినాడ కలెక్టరేట్‌లో డిప్యూటి సిఎం పవన్‌కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన కూతురు కిడ్నాప్ కు గురైందని ఓ మహిళ తన వద్దకు వచ్చిందని.. ఆమె ఫిర్యాదు మేరకు విచారణ చేయాలని పోలీసుకుల ఆదేశాలు జారీ చేశామన్నారు. పోలీసులు 48 గంటల్లో ఆ అమ్మాయి ఆచూకీని జమ్ముకశ్మీర్లో గుర్తించారు. అక్కడి పోలీసుల సాయంతో వారిని విజయవాడ రప్పించేందుకు పరయత్నాలు చేస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వం తలచుకుంటే ఏం చేయగలదనే నిరూపించడానికే మీకు చెబుతున్నానని.. గత ఐదేళ్లలో ప్రభుత్వంలో ఏమాత్రం కదలికలు లేవన్నారు. ప్రస్తుత పాలనలో జరుగుతున్న మార్పులు ప్రజలు గుర్తించాలన్నారు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంతో ఆప్రమత్తంగా వ్యవహరించాలని పవన్‌కల్యాణ్ సూచించారు. పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసేలా చేస్తానని జనసేనాని తెలిపారు.