ఉన్నత విద్య కోసం గిరిజన విద్యార్థులకు ప్రభుత్వం ఆర్ధిక సాయం

హైదరాబాద్(CLiC2NEWS) : తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే గిరిజన విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తోందని రాష్ట్ర గిరిజన స్త్రీ-శిశు సంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. దేశ, విదేశాల్లోని విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొందిన గిరిజన గురుకులాల విద్యార్థులకు నగదు, ల్యాప్‌టాప్‌లను అందిస్తున్నారు. నీట్ ద్వారా ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సుల్లో సీట్లు పొంది విదేశాల్లో చదివితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకం కింద రూ. 20 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. ఐఐటిలో సీట్లు సాధించిన వారికి రూ. 50 వేలు, ల్యాప్‌టాప్ అందిస్తున్నారు. ఎన్ఐటి /ఐఐటి సంస్థల్లో సీటు సాధించిన వారికి రూ. 40 వేలు,ల్యాప్‌టాప్ అందిస్తున్నారు. ఎంబిబిఎస్ లోసీటు సాధించిన వారికి రూ. 50 వేలు, బిడిఎస్ లో సీటు సాధించిన వారికి రూ.40 వేలు ప్రోత్సాహకంగా ఇస్తున్నామని తెలియజేశారు.