రాష్ట్రంలోని చేనేత కార్మికులకు శుభవార్త

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో ఉన్న చేనేత కార్మికులకు ప్రభుత్వం శుభవార్తనందించింది. చేనేత కార్మికుల రుణమాఫీ పథకానికి సర్కార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకం ద్వారా రూ. లక్ష వరకు ఉన్న రుణాలు మాఫీ చేయనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులకు రూ.33 కోట్ల రుణమాఫీకి ప్రాథమిక అనుమతుల మంజూరయ్యాయి. 2017 ఏప్రిల్ 1 నుండి 2024 మార్చి 31 వరకు ఉన్న రుణ బకాయిలను మాఫీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.