దళితబంధు విధివిధానాలు జారీ చేసిన స‌ర్కార్‌

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ స‌ర్కార్ ద‌ళిత‌బంధు ప‌థ‌కాన్ని ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ద‌ళిత బంధు అమ‌లు కోసం రాష్ట్ర స‌ర్కార్ అద‌న‌పు విధివిధానాలు జారీ చేసింది. ఈ మేర‌కు మార్గ‌దర్శాకాలు ప్ర‌క‌టిస్తూ ఎస్సీ అభివృద్ధి శాఖ ఆదేశాలు శ‌నివారం జారీ చేసింది.
ల‌బ్ధిదారుల గుర్తింపు ప్ర‌క్రియ పూర్త‌య్యాక ద‌ళిత‌బంధుకోసం ప్ర‌త్యేకంగా బ్యాంకు ఖాతా తెర‌వాల‌ని సంబంధ‌ఙ‌త పాసుపుస్త‌కాల‌ను ల‌బ్ధిదారుల‌కు అందించాల‌ని తెలిపింది. ఆ ఖాతాలోకి రూ. 9.90 ల‌క్ష‌లు క‌లెక్ట‌ర్ బ‌దిలీ చేయాల‌ని పేర్కొంది.

  • లబ్ధిదారులకు కేటాయించే రూ.10లక్షల నిధులతో సాధ్యమైతే రెండు యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది.
  • ఇద్దరు లేదా ఎక్కువ మంది కలిసి పెద్ద యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.
  • యూనిట్ల ఎంపిక పూర్తయ్యాక ఆయా రంగాల్లో లబ్ధిదారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.
  • రెండు వారాల నుంచి ఆరు వారాల్లోపు శిక్షణ ఉండనుంది.
  • అవసరమైతే లబ్ధిదారులను ప్రభుత్వమే వివిధ ప్రాంతాల్లో పర్యటనకు తీసుకెళ్లనుంది.
  • ఆయా రంగాల్లో విజయవంతమైన వారితో లబ్ధిదారులకు అవగాహన కల్పించనుంది.
  • రిసోర్స్ బృందాల‌తో క‌లెక్ట‌ర్ ల‌బ్ధిదారుల వ‌ద్ద‌కు వెళ్లి వారికి వివిధ యూనిట్ల‌పై అవ‌గాహ‌న క‌ల్పించాలి. అవ‌స‌ర‌మైతే రిసోర్స్ బృందాలు ఎక్కువ‌మార్లు కూడా ల‌బ్ధిదారుల వ‌ద్ద‌కు వెళ్లాల‌ని ప్ర‌భుత్వం తెలిపింది.
1 Comment
  1. Suresh says

    Jai telangana

Leave A Reply

Your email address will not be published.