మూసీ పరిసరాల్లో నిర్మాణాలపై సర్కార్ కీలక ఉత్తర్వులు

హైదరాబాద్ (CLiC2NEWS): మూసీ పరిసర ప్రాంతాల్లో ప్రణాళికా రహిత నిర్మాణాలు చేపట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికోసం తగు చర్యలు తీసుకుంది. మూసీకి 50 మీటర్ల వరకు బఫర్ జోన్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. 50 నుండి 100 మీటర్ల వరకు కొత్తగా ఎటువంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వరాదని ఉత్తర్వుల్లో తెలిపింది.
మూసీ పరిసర ప్రాంతాల్లో నిర్మాణాల నియంత్రణకు సంబంధించి సర్కార్ నలుగురు సీనియర్ అధికారులతో కూడిని కమిటి ఏర్పాటు చేసింది. మూసి రివర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ జెఎండి, డిటిసిపి, జిహెచ్ఎంసి చీఫ్ ప్లానర్, హెచ్ ఎండిఎ ప్లానింగ్ డైరెక్టర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. మాస్టర్ ప్లాన్ ఖరారయ్యే వరకు , కమిటి క్లియర్ చేసేంత వరకు ఏవిధమైన కొత్త అనుమతులు ఇవ్వకూడదని ప్రభుత్వం ఆదేశించింది. మూసీకి 100 మీటర్ల వరకు ప్రభుత్వ పనులు చేపట్టాలన్నా ముందస్తు అనుమతి తప్పనిసరి అని పేర్కొంది.