చీర అంటే సంతోషం.. గౌర‌వం: గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై

హైద‌రాబాద్ (CLiC2NEWS): న‌గ‌రంలోని నెక్లెస్‌రోడ్డులో పీపుల్స్ ప్లాజా వేదిక‌గా జ‌రుగుతున్న జాతీయ సంస్కృతి మ‌హోత్స‌వం ముగింపు వేడుక‌లకు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. దీనిలో శారీ వాక‌థాన్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. గ‌వ‌ర్న‌ర్ బెలూన్‌లు ఎగుర‌వేసి వాక‌థాన్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ చీర‌ను గురించి తెలుగులో మాట్లాడారు. చీర మ‌న‌దేశానికి గుర్తింపు.. చీర అంటే సంతోషం, గౌర‌వం. అంద‌రూ చీర‌లు ధ‌రించేలా ప్రోత్స‌హించాలి అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి, కేంద్ర రైల్వే, టెక్స్‌టైల్స్ శాఖ మంత్రి ద‌ర్శ‌న జ‌ర్దోష్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.