కావాలనే అవమానిస్తున్నారు. గవర్నర్ తమిళిసై

ఢిల్లీ (CLiC2NEWS): తన విషయంలో ఏం జరుగుతుందో తెలంగాణ ప్రజలు, మీడియాకు తెలుసని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రిని అమిత్‌షాను కలిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
నేను బాధ్యతాయుత పదవిలో ఉన్నాను. అందరితో స్నేహపూర్వకంగా ఉండే వ్యక్తిని, భద్రచలంలో శ్రీరామనవమి ఉత్సవాలకు హాజరవుతాను. రోడ్డు లేదా రైలు మార్గంలో వెళ్తాను, మేడారం జాతరకు కూడా 5 గంటలు పాటు రోడ్డు మార్గంలోనే వెళ్లాను. రాజ్‌భవన్‌కు ఏపార్టీతోనూ సంబంధం ఉండదు. ఉగాది వేడుకలకు ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానించాను. రాజ్‌భవన్, గవర్నర్‌ను కావాలనే అవమానిస్తున్నారు. తమిళిసైని కాకపోయినా.. రాజ్‌భవన్‌ను గౌరవించాలి. నేను ఎవర్నీ విమర్శించడం లేదు. రాజ్‌భవన్, గవర్నర్ విషయంలో జరిగేది మాత్రమే చెబుతున్నా. ఒక మహిళను గౌరవించే విధానం ఇది కాదు. సోదరిగా భావిస్తే ఇలా అవమానిస్తారా? అని గవర్నర్ ప్రశ్నించారు.
అంతకుముందు గవర్నర్ ప్రధాని నరేంద్రమోడి, నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. గిరిజనుల సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సదుపాయాలు పెంచాలని కోరారు. తెలంగాణ, పుదుచ్చేరికి సంబంధించిన అంశాలపై చర్చించారు.