గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వికి త‌మిళిసై రాజీనామా..

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సొంద‌ర‌రాజ‌న్ ప‌ద‌వికి రాజీనామా చేశారు. 2019 సెప్టెంబ‌ర్ 8వ తేదీన రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. పుదుచ్చేరి లెప్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా కూడా అద‌న‌పు బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ ప‌ద‌వికి కూడా ఆమె రాజీనామా చేశారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకే ఆమె రాజీనామా చేసిన‌ట్లు స‌మాచారం. త‌న రాజీనామా లేఖ‌ను రాష్ట్రప‌తికి పంపించారు. గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి చేప‌ట్ట‌కు ముందు ఆమె త‌మిళ‌నాడు బిజెపి అధ్య‌క్షురాలిగా వ్య‌వ‌హరించారు.

Leave A Reply

Your email address will not be published.