వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన గవర్నర్ తమిళిసై
![](https://clic2news.com/wp-content/uploads/2023/08/hunter-road-governer.jpg)
వరంగల్ (): గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలు అతలాకులమయ్యాయి. భారీ వర్షాలకు వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బుధవారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ వరంగల్, హనుమకొండలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఓరుగల్లు చేరుకున్న గరవ్నర్ తొలుత భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. తదుపరి హంటర్ రోడ్డులోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. స్థానికంగా ఎన్టీఆర్ నగర్, ఎస్ ఎన్ నగర్ ప్రాంతాల్లో పలువురు బాధితులను గవర్నర్ పరామర్శించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ సమకూర్చిన నిత్యావాసరాలను బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా బాధితుల సమస్యలను సర్కార్ దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. వారద బాధితులకు సాయం అందేలా చూస్తానని గవర్నర్ హామీ ఇచ్చారు.