గోవిందాకు బుల్లెట్ గాయాలు

ముంబయి (CLiC2NEWS): నటుడు గోవిందా ఇంట్లో గన్ మిస్‌ఫైర్ కావడంతో అతని కాలులోకి ప్రమాదవశాత్తు బుల్లెట్ దూసుకెళ్లింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
మంగళవారం ఉదయం ఇంటి నుంచి కోల్‌కతాకు వళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లైసెన్స్ డ్ రివాల్వర్ ను తీసుకెళ్తుండగా అది చేయి జారి కిందపడింది. దీంతో గన్ పేలి కాలిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. కాగా వైద్యులు బుల్లెట్‌ను తొలగించారు. ప్రస్తుతం గోవిందా ఆరోగ్యం నిలకడగా ఉందని అతని మేనేజర్ వెల్లడించారు.
`నా తల్లిదండ్రుల ఆశీర్వాదం, మీ అందరి ప్రేమ వల్ల నేను ఈ ప్రమాదం నుండి బయటపడ్డాను. కాలు నుంచి బుల్లెట్‌ను తొలగించారు“ అని నటుడు గోవిందా వెల్లడించారు.