2,910 ఉద్యోగాల భ‌ర్తీకి స‌ర్కార్ అనుమ‌తి

హైద‌రాబాద్ (CLiC2NEWS): నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. తెలంగాణలో మ‌రో 2,910 ఉద్యోగాల భ‌ర్తీకి స‌ర్కార్ అనుమతిని ఇచ్చింది. ఈ సారి గ్రూప్ -2, గ్రూప్ -3 ఉద్యోగాల భ‌ర్తీకి ప‌చ్చ‌జెండా ఊపింది. వీటిలో భాగంగా 663 గ్రూప్ -2 ఉద్యోగాలు, 1373 గ్రూప్‌-3 ఉద్యోగాల భ‌ర్తీకి స‌ర్కార్ ఓకే అంది. దీంతో పండుగ వేల నిరుద్యోగుల‌కు శుభ‌వార్త చెప్పిన‌ట్ల‌యింది.

ఈ అనుమ‌తితో తెలంగాణ‌లో యాభై వేల మైలురాయిని అధిగ‌మించిన‌ట్ల‌యింద‌ని ఆర్ధిక మంత్రి హ‌రీష్‌రావు పేర్కొన్నారు. గ‌త మూడునెల‌ల్లో 52,460 ఉద్యోగా భ‌ర్తీకి అనుమ‌తి ఇచ్చిన‌ట్లు మంత్రి ట్విట్ట‌ర్ వేదిక‌గా పేర్కొన్నారు.

గ్రూప్ -2 ఉద్యోగాల్లో

జీఎడి ఎఎస్‌వో పోస్టులు 165
పంచాయ‌తిరాజ్ ఎంపిడివో 125
డిప్యూటీ త‌హ‌సీల్దార్ 98
ఎక్సైజ్ ఎస్ ఐ 97
అసిస్టెంట్ క‌మ‌ర్షియ‌ల్ టాక్స్ ఆఫీస‌ర్ 59
వీటితో పాటు, 38 చేనేత ఎడివోలు, 25 ఆర్థిక శాఖ ఎఎస్ఓ పోస్టులు, 15 అసెంబ్లీ ఎఎస్‌వో పోస్టులు, 14 గ్రేడ్‌2 స‌బ్ రిజిస్ట్రార్ పోస్టులు, 11 గ్రేడ్ 3 మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ పోస్టులు, 9 ఎఎల్‌వో, 6 ఆన్యాయ‌శాఖ ఎఎస్ొఓ పోస్టులు ఉన్నాయి.

గ్రూప్ -3లో..
మొత్తం 99 విభాగాధిపతులు..
కేట‌గిరీల ప‌రిధిలో 1,373 జూనిర‌య్ అసిస్టెంట్, సీనియ‌ర్ అకౌంటెంట్‌, ఆడిట‌ర్, జూనియ‌ర్ అకౌంటెంట్ పోస్టులు ఉన్నాయి.

అలాగే వ్య‌వ‌సాయ శాఖ‌లో 199 గ్రేడ్‌- 2 ఎఇఒ పోస్టులు
148 ఎవో పోస్టులు

ఉద్యాన‌వ‌న శాఖ‌లో 21 హార్టీక‌ల్చ‌ర్ అధికారుల పోస్టులు,
స‌హాకార శాఖ‌లో 63 అసిస్టెంట్ రిజిస్ట్రార్‌, 36 జూనియ‌ర్ ఇన్‌స్పెక్ట‌ర్ పోస్టులు

ప‌శుసంవ‌ర్థ‌క శాఖ‌లో 183 వెట‌ర్నిటీ అసిస్టెంట్ స‌ర్జ‌న్‌, 99 వెట‌ర్న‌రీ అసిస్టెంట్ స‌హా 294 ఉద్యోగాల భ‌ర్తీకి అనుమ‌తి ఇచ్చారు.

 

 

 

1 Comment
  1. zoritoler imol says

    Greetings! I know this is kind of off topic but I was wondering which blog platform are you using for this website? I’m getting tired of WordPress because I’ve had issues with hackers and I’m looking at alternatives for another platform. I would be fantastic if you could point me in the direction of a good platform.

Leave A Reply

Your email address will not be published.