కాంట్రాక్టు ఉద్యోగుల క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌కు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్‌

అమ‌రావ‌తి (CLiC2NEWS): 10 సంవ‌త్స‌రాల స‌ర్వీసు దాటిన కాంట్రాక్టు ఉద్యోగుల‌ను రెగ్యుల‌ర్ చేసేందుకు ప్ర‌భుత్వం అంగీకారం తెలిపింద‌ని ఎపి స‌చివాల‌య ఉద్యోగుల సంఘం అధ్య‌క్షుడు వెంక‌ట్రామిరెడ్డి తెలిపారు. ఎపిలో వివిధ ఉద్యోగ సంఘాల ప్ర‌తినిధులు మంత్రుల క‌మిటీ స‌భ్యులు అయిన బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, స‌ల‌హాదారు స‌జ్జ‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. స‌మావేశానంత‌రం వెంక‌ట్రామిరెడ్డి మీడియాకు వివ‌రించారు.

13 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల‌ను రెగ్యుల‌ర్ చేస్తామ‌ని ప్ర‌భుత్వం హామీ ఇచ్చింద‌ని.. 10 ఏళ్ల స‌ర్వీసు దాటిన కాంట్రాక్టు ఉద్యోగుల‌ను రెగ్యుల‌ర్ చేసేందుకు ప్ర‌భుత్వం అంగీక‌రించింద‌ని వెంక‌ట్రామిరెడ్డి తెలిపారు. రెండు డిఎలు పెండింగ్‌లో ఉన్నాయ‌ని, ఎన్నిక‌ల కోడ్ ముగిశాక ఒక డిఎ ఇస్తామ‌ని క‌మిటీ తెలిపింది. త్వ‌ర‌తో సిపిఎస్‌పై కూడ ఒక నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు. సిపిఎస్ ఉద్యోగుల‌పై న‌మోదు చేసిన మొత్తం 1600 కేసుల‌ను కూడా మాఫీ చేయ‌నున్న‌ట్లు తెలిపారు. గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగుల బ‌దిలీల‌కు గ్రీన్ సిగ్నల్ వ‌చ్చింద‌న్నారు. వారికి స‌ర్వీస్ రూల్స్‌, జాబ్ ఛార్ట్ సిద్ధం చేస్తామ‌ని హామీ ఇచ్చారని.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయాల‌ని కోరిన‌ట్లు తెలిపారు. అంతేకాకుండా ఉద్యోగుల‌కు ఇళ్ల స్థ‌లాలు ఇస్తామ‌ని, రిజిస్ట్రేష‌న్ విలువ ప్ర‌కారం భూకేటాయింపులు చేప‌డ‌తామ‌ని.. ప్ర‌భుత్వంలో ఉద్యోగ సంఘాల నేత‌ల‌పై అనిశా కేసులు లేవని తెలియ‌జేశారు.

1 Comment
  1. Peter says

    I really like your blog.. very nice colors & theme.
    Did you design this website yourself or did you hire someone
    to do it for you? Plz respond as I’m looking to design my own blog and would like to
    know where u got this from. appreciate it

Leave A Reply

Your email address will not be published.