నిమ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
![](https://clic2news.com/wp-content/uploads/2022/12/NIMS-HOSPITAL.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని నిమ్స్‌లో 132 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానంలో భర్తీ చేయనున్నారు. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ ఉద్యోగాలకు క్యాడర్ వైస్ వేకెన్సీ పొజిషన్, రోస్టర్ పాయింట్లు వంటి అర్హతల ఆధారంగా ఎంపిక చేయనున్నారు.