తెలంగాణలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీ షెడ్యూల్ విడుదల
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో టీచర్ల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. జనవరి 27వ తేదీ నుండి పదోన్నతులు, బదిలీ ప్రక్రియను ప్రారంభిస్తారు. దీనికి సంబంధించిన దరఖాస్తులను జనవరి 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు. మార్చి 4వ తేదీ నాటికి ఈ ప్రక్రియను పూర్తిచేయనున్నట్లు సమాచారం. అనంతరం మార్చి 5 నుండి 19వ తేదీ వరకు అప్పీళ్లను స్వీకరిస్తారు. ఉపాధ్యాయుల నుండి దరఖాస్తులు స్వీకరించిన 15 రోజుల్లో అప్పీళ్లను పరిష్కరించనున్నట్లు తెలిపారు.